Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Imran Khan: కంటి చికిత్స కోసం ఇమ్రాన్ ఖాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. సుమారు 100కుపైగా కేసులు ఆయనపై ఉన్నాయి.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను కంటి చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ వ్యవస్థాపకుడైన ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. సుమారు 100కుపైగా కేసులు ఆయనపై ఉన్నాయి. అవినీతి, హింసను ప్రేరేపించిన కేసుల్లో ఇమ్రాన్ నిందితుడు. రావల్పిండిలోని అడియాలా జైలులో అతన్ని నిర్బంధించారు. అయితే జనవరి నుంచి ఇమ్రాన్ ఖాన్ తన కుడి కన్నుకు చికిత్స చేయించుకుంటున్నారు. చూపు మందగించినట్లు ఫిర్యాదు చేయడంతో చికిత్స ప్రారంభమైంది. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు ఇమ్రాన్‌ను పరీక్షల కోసం తీసుకెళ్తారు. ఇమ్రాన్ ఖాన్‌కు చికిత్స అందిస్తున్న కంటి డాక్టర్ సూచన మేరకు అతనికి పరీక్షలు చేసినట్లు పీఐఎంఎస్ అధికారి పేర్కొన్నారు. చికిత్స సమయంలో ఇమ్రాన్‌కు ఇంట్రావిట్రియల్ యాంటీ వీఈజీఎఫ్ ఇంజెక్షన్ ఇచ్చారు. 2018లో ఇమ్రాన్ ప్రధాని అయ్యారు. అయితే 2022లో జరిగిన అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

