వికారాబాద్ : గ్రామాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి యూపీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం మండలంలోని పులుమద్ది గ్రామంలో ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా వారు గత బీఆర్ఎస్ హయాంలో గ్రామాల్లో చేపట్టిన బృహత్ పల్లె ప్రకృతివనాలు, క్రీడాప్రాంగణాలు, డంపింగ్ యార్డులు, చెత్త ట్రాక్టర్, ఇంకుడు గుంతలు తదితర పనులను పరిశీలించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి చేశారని కితాబిచ్చారు. ఆయన చేపట్టిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టిందన్నారు. కాగా, ప్రస్తుత కాంగ్రెస్ పాలనపై గ్రామంలో ఆరా తీశారు. 21 నెలలుగా గ్రామాలకు నిధులు రాక, అభివృద్ధి పనులు జరగడంలేదని తెలుసుకున్నారు. యూపీ బృందంలో అధికారులు, సర్పంచ్‌లు ఉన్నారు. కార్యక్రమంలో డీఎల్పీవో సంధ్యారాణి, వికారాబాద్ ఎంపీడీవో వినయ్‌కుమార్, ఎంపీవో దయానంద్, ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.