నాగర్‌కర్నూల్, నవంబర్ 19: నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. నియోజకవర్గంలోని బిజినేపల్లి, తెలకపల్లి, నాగర్‌కర్నూల్, తాడూరు, తిమ్మాజిపేట మండలాలతోపాటు ఇతర మండలాల నుంచి ప్రజలను సభకు తరలించారు. దాదాపు 20వేల మంది జనసైన్యం రావడంతో ఉయ్యాలవాడ సమీపంలోని ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం కిక్కిరిసిపోయిం ది. మండలాలతోపాటు నాగర్‌కర్నూల్ పట్టణంలోని 24వార్డుల నుంచి భారీగా ప్రజానికం సభకు హాజరయ్యారు. సభా ప్రాంగణం ఎక్కువై ప్రజలు పెద్దసంఖ్యలో నిలబడి కేసీఆర్ ప్రసంగాన్ని విన్నారు. అంతకుముందు బీసీ నాయకుడు బిత్తిరి సత్తి, సావిత్రీ ఆటామాటలతో ప్రజలను ఉత్సాహపరిచారు.
సాయంత్రం 4గంటల ప్రాంతంలో హెలీక్యాప్టర్‌లో వచ్చిన సీఎం కేసీఆర్ సభా ప్రాంగణం చుట్టూ చక్కర్లు కొడుతుండంతో ప్రజలు, కార్యకర్తలు, తెలంగాణ అభిమానులు కేరింతలు కొడు తూ స్వాగతం పలికారు. మీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, ఐటీ హబ్, యువత ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలను ఏర్పాటు చేయాలని అడిగారని వాటిని ప్రభుత్వం ఏర్పాడ్డా క తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు కేరింతలు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. అరగంటపాటు సాగి న ప్రసంగంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి గురించి వివరించారు.కార్యక్రమంలో ఎంపీ రా ము లు, డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాస్‌యాదవ్,ఎంజేఆర్ ట్రస్టు డైరెక్టర్ మర్రి జమునారాణి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్‌రా వు,మున్సిపల్ చైర్పర్సన్ కల్పనాభాస్కర్‌గౌడ్,వైస్ చైర్మన్ బా బురావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ పద్మావతీబంగారయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మ య్య,నాయకులునాగం శశిధర్ నరేందర్‌రెడ్డి, ఎంపీపీలు,జెడ్పీటీసీలు,కౌన్సిలర్లు పాల్గొన్నారు.
బిజినేపల్లి, నవంబర్ 19: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వేలాదిగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం తరలివచ్చారు. భారీ కటౌట్లతో సభా ప్రాంగణమంతా గులాబీమయమైంది. నియోజకవర్గంలోని తెలకపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, నాగర్‌కర్నూల్, బిజినపల్లి మండలాల నుంచి వేలాదిగా ప్రజానీకం సీఎం కేసీఆర్ సభకు తరలివచ్చారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాలు గులాబీ జెం డాలు, తోరణాలుతో వాహనా ల్లో భారీ ర్యాలీగా సభా ప్రాంగణాలకు చేరుకున్నారు. సభా ప్రాంగణమంతా ప్రజానీకంతో కికిరిసిపోయింది. ఆటోలు, జీపులు, డీసీఎంలు, కార్లు, ద్విచక్రవాహనాల్లో ప్రాంగణానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ 4గంటల సమయంలో కందనూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు చేరుకున్నారు. దారులన్నీ నాగర్‌కర్నూల్ వైపు తరలుతుండడంతో జనసముద్రంలా తలపించింది. సభాప్రాంగణంలో సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి కటౌట్లు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేసే సంక్షేమ పథకాల వివరాలతో కూడి న ఫ్లెక్సీలు పలువురిని ఆకట్టుకున్నాయి. స్థానిక నాయకుల ప్రసంగం అనంతరం 4గంటల 30నిమిషాలకు సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. సుమారు 40నిమిషాలపాటు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతుండగా కేరింతలు, విజిల్లు, సంతోషం వ్యక్తం చేస్తూ ప్రసంగాన్ని విన్నారు.