ఖమ్మం, సెప్టెంబర్ 25: కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిందలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నదని ఆరోపించారు. ఖమ్మంలో మాజీ మంత్రి అజయ్ నివాసంలో గురువారం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధక్షతన జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఇరత రాష్ర్టాల్లో తిరుగుతూ రాష్ర్టాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండేళ్లకే తీవ్ర వ్యతిరేకత పెరిగిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రైతు రుణమాపీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, రూ.4 వేల పింఛన్లు, ఆడపిల్లలకు సూటీలు, తులం బంగారం హామీలు నెరవేర్చకుండా సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేైండ్లెనా ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.