కేసీఆర్ మరోసారి సీఎం కావాలి.. వద్దిరాజు రవిచంద్ర
కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు.
- ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేద్దాం
- రెండేళ్లకే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత: మాజీ మంత్రి అజయ్
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెబుదాం: మాజీ ఎంపీ నామా
ఖమ్మం, సెప్టెంబర్ 25: కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేదని విమర్శించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిందలు వేస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నదని ఆరోపించారు. ఖమ్మంలో మాజీ మంత్రి అజయ్ నివాసంలో గురువారం బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు అధక్షతన జరిగిన బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇరత రాష్ర్టాల్లో తిరుగుతూ రాష్ర్టాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండేళ్లకే తీవ్ర వ్యతిరేకత పెరిగిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
రైతు రుణమాపీ, రైతు భరోసా, నిరుద్యోగ భృతి, రూ.4 వేల పింఛన్లు, ఆడపిల్లలకు సూటీలు, తులం బంగారం హామీలు నెరవేర్చకుండా సీఎం ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేైండ్లెనా ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. బీఆర్ఎస్ను అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
IAS Transfers | రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు.. కీలక శాఖల్లో కొత్త నియామకాలు
Idupu Kaayitham | ‘ఇడుపు కాయితం’ ఆద్యంతం ఎంగేజ్ చేస్తుంది.. థియేటర్ నుంచి హ్యాపీగా వెళ్తారు: బన్నీ వాస్
‘నాటి కేసీఆర్ దీక్ష ఫలితమే నేటి తెలంగాణ’
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

