హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): శ్రీ సీతారామచంద్రమూర్తి భక్తుడిగా, బలం, జ్ఞానం, వాక్చాతుర్యం, భక్తి, వినయం అన్నీకలిసి, అరుదైన వ్యక్తిత్వం కలిగిన జ్ఞానిగా, హిందూ పురాణాలు హనుమంతుడిని కీర్తిస్తాయని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.
హనుమంతుడి ఆచరణ ఎల్లకాలం ఆదర్శనీయమని, నేటి యువతరానికి ఆచరణీయమని పేర్కొన్నారు. శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదర్శవంతమైన ఆలోచనలు, దూరదృష్టితో తమ జీవితాలను తీర్చిదిద్దుకునే శక్తిని హనుమంతుడు రాష్ట్ర ప్రజలకు అందించాలని, ప్రగతి తిరిగి పుంజుకుని రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కేసీఆర్ ప్రార్థించారు.