హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా దామగుండంలో నిర్మించతలపెట్టిన రాడార్ ప్రాజెక్టు వల్ల అడవులకు ముప్పు ఏర్పడకుండా, ఇకడ అటవీకరణ పనులు చేపట్టాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. దామగుండంలో రాడార్ సెంటర్ నిర్మాణ పనులు చేసుకోవచ్చని కోర్టు పేర్కొన్నది. దామగుండంలో ఏర్పాటుచేస్తున్న ఫ్రీక్వెన్సీ రాడార్ ప్రాజెక్టు పనులను కొనసాగించడానికి హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, అటవీకరణ పనులను కొనసాగించాలని, వాటి పురోగతిని తెలుసుకోవడానికిగాను ఆరు నెలలపాటు ఈ పిటిషన్‌ను పెండింగ్‌లో ఉంచుతున్నామని పేరొన్నది. దామగుండంలో 2,900 ఎకరాల అటవీ భూములను రాడార్ కేంద్రానికి కేటాయించడాన్ని సవాలు చేస్తూ దామగుండం ఫారెస్ట్ ప్రొటెక్షన్ జేఏసీ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ దాఖలు చేసిన కౌంటరులో రాడార్ కేంద్రం వల్ల దెబ్బతిన్న అటవీప్రాంత అభివృద్ధికి ప్రత్యామ్నాయంగా గత రెండేండ్లలో 9.16 లక్షలు మొకలు నాటామని, వీటిలో 8.23 లక్షల మొకలు బతికాయని పేరొన్నారు. చనిపోయిన వాటి స్థానంలో 92 వేల మొకలను వచ్చే వానకాలంలో నాటనున్నట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం 688 హెక్టార్లలో అటవీకరణకు చేస్తున్న ప్రయత్నాలు కొనసాగించాలని, ఈ ప్రక్రియకు పదేండ్ల గడువు ఉన్న నేపథ్యంలో 100% మొకలు బతికి ఉంటాయని, అటవీకరణ పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేసింది.