హైదరాబాద్ : బీఆర్ఎస్ ఉద్యమనేత కేసీఆర్ ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. తమ ఆరాధ్య నాయకుడిని చూసేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో వారికి అభివాదం చేస్తూ కేసీఆర్ ముందుకు కదిలారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు(KCR) సిట్ నోటీసులు(c)జారీచేసిన విషయం తెలిసిందే. కేసు విచారణ సందర్భంగా హైదరాబాద్ నందినగర్‌లోని తన నివాసానికి చేరుకోనున్నారు.
ఈ నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. నందినగర్ బస్ స్టాప్, బసవతారకం రోటరీ, అగ్రసేన్ జంక్షన్, టీఎస్ స్టడీ సర్కిల్, ఎన్టీఆర్ భవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని వాహనదారులు ప్రత్యమ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలను చేరుకోవాలనిఅధికారులు సూచించారు.