హైదరాబాద్ ఆట ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నీని నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా ఈనెల 15, 16, 17 తేదీల్లో పురుషుల, మహిళల విభాగాల్లో వాలీబాల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీలో విజేతగా నిలిచిన జట్టుకు లక్ష రూపాయలు, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లుకు వరుసగా రూ. 50వేలు, రూ.25 వేల నగదు బహుమతిని అందివ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.