KCR | రంగారెడ్డి, ఫిబ్రవరి 17 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ సాధన సారథి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ శ్రేణులు కన్నుల పండువగా జన్మదిన వేడుకలు జరిపారు. ప్రధాన కూడళ్లల్లో కేక్‌కట్‌చేసి పటాకులు పేల్చి, స్వీట్లు తినిపంచుకున్నారు. పలు ప్రాంతాల్లో ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయగా, మరికొన్నిచోట్ల అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. అనంతరం ఆయన కేక్‌కట్‌చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. కడ్తాల్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్ఆధ్వర్యంలో కేకట్చేసి జన్మదిన వేడుకలు జరిపారు. షాద్‌నగర్ పట్టణ కేంద్రంలో జరిపిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొని కేక్‌కట్‌చేసి సంబరాలు జరిపారు. షాబాద్ మండలంలోని ముద్దంగూడలో ఆ పార్టీ యువనేత పట్నం అవినాష్‌రెడ్డి ఆధ్వర్యంలో పొలాల్లో రైతులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్‌కట్‌చేశారు. అలాగే, బాకారం గ్రామంలో గల శాంతినిలయంలో బీఆర్ఎస్ శ్రేణులు చిన్నపిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. యాచారం ప్రభుత్వ ఆస్పత్రిలో చెట్లునాటి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే, జిల్లావ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలను జరిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి.
Rangareddy Kcr1
మొయినాబాద్ మండల కేంద్రంతో పాటు అజీజ్ నగర్ గ్రామంలో కేసీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొంపల్లి అనంతరెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు దారెడ్డి వెంకట్ రెడ్డి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కొత్త మాణిక్ రెడ్డి బాకారం గ్రామంలో గల శాంతి నిలయంలో పేద పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. హిమాయత్ నగర్ చౌరస్తాలో కేసీఆర్ జన్మదినం వేడుకలను పురస్కరించుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
కేసీఆర్‌కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలి : జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
తెలంగాణ సాధించిన కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకోసం త్యాగాలు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని పట్టుబట్టిసాదించారని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అభివృద్ధితో పాటు ప్రజలకు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అలవికాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలన్ని నిలిపివేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
దేశం మెచ్చిన గొప్ప నాయకుడు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన కేక్‌కట్‌చేశారు. ఈ సందర్భంగా మంచిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి, సాధించిన తెలంగాణను అతితక్కువ కాలంలో అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రైతుబంధు, రైతుభీమా, దళితబంధు, బీసీబంధు, కేసీఆర్కిట్లు, కల్యాణలక్షీ, షాదీ ముబారక్‌తో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం ఐటీరంగ పరిశ్రమలు పెద్ద ఎత్తున నెలకొల్పారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని ఆయన ఆయురారోగ్యాలతో ఉండి రాష్ట్రానికి మరిన్నిసేవలందించాలని మంచిరెడ్డి పిలుపునిచ్చారు.