హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేసి ఎన్నికలకు వస్తే, తాను కూడా హుజూరాబాద్ లో రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరారు. ఒకవేళ ఆ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి డిపాజిట్ వస్తే తాను ముకు నేలకు రాస్తానని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాధవరం కృష్ణారావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీఎం రేవంత్‌రెడ్డి తాను ఎన్నడూ బూతులే మా ట్లాడనట్టు, బీఆర్ఎస్ సభ్యుల భాషను విమర్శిస్తూ మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. అసెంబ్లీ సా క్షిగా సీఎం మాట్లాడిన భాష అత్యంత అభ్యంతరకరం గా ఉన్నదని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కత్తులతో నరుకుతామని బహిరంగంగా హెచ్చరించినా, తమ ఎమ్మెల్యే మర్లేసి కొడతాడు అని బీఆర్ఎస్ సభ్యులను సీఎం బెదిరించినా ఎథిక్స్ కమిటీ ఎందుకు పట్టించుకోవడం లేదని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. తమపై మా త్రం చర్యలు తీసుకోవాలని కుట్ర పన్నుతున్నారని ఆ గ్రహం వ్యక్తంచేశారు. గతంలో కడియం శ్రీహరి డిప్యూ టీ సీఎంగా, ఎమ్మెల్సీగా, ఎంపీగా ఉన్నప్పుడు ఎథిక్స్ కమిటీ, విలువలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.