మల్కాజిగిరి, నవంబర్ 19 : కార్తిక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు. శుక్రవారం అల్వాల్‌లోని ఆలయంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో నరేందర్, కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, రాజ్ జితేంద్రనాథ్, డివిజన్ అధ్యక్షుడు టీవీ భాస్కర్, అనిల్‌కిశోర్, సురేందర్‌రెడ్డి, రాము, శివరామకృష్ణ, సంతోష్, ఈఎస్ లక్ష్మణ్, సుదేశ్, రాజు, ముత్యాలు, నర్సింగ్, ప్రభాకర్, లక్ష్మి, రమ పాల్గొన్నారు.