హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ) : నీళ్ల పంపకాల్లో అంతర్రాష్ట్ర ఒప్పందాలపై ఎవరు సంతకం పెడతారో అవగాహనలేకనే పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఎద్దేవా చేశారు. నీళ్ల పంపకాలు, నీటి ప్రాజెక్టులపై మాజీ మంత్రి హరీశ్‌రావు అనేకసార్లు పీపీటీ ద్వారా వివరించినా కాంగ్రెస్ నాయకులకు అర్థంకాకపోవడం విడ్డూరమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకుల మాటలు విని ప్రజలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా నవ్వుకుంటున్నారని గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, కాంగ్రెస్ 18 నెలల పాలనలో జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.