హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కరీంనగర్ వాస్తవ్యుడు, రాజమండ్రిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ (ఐసీఎంఆర్) డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషు మాధవ్‌కు డాక్టర్ ఎంవీరెడ్డి జాతీయ పురస్కారం లభించింది.
ఆదివారం రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. మొకల జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ రంగాల్లో శేషుమాధవ్ చేసిన కృషితోపాటు అధిక దిగుబడినిచ్చే, ఒత్తిడిని తట్టుకునే వరి రకాల అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లినందుకు ఈ అవార్డు వరించింది.
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖలో పెన్షనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏఎల్ ఖిస్మత్కుమార్, ప్రధాన కార్యదర్శిగా ఎంవీ భాస్కర్‌రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఏఆర్ వెంకటేశం, కోశాధికారిగా ఎం రమాదేవిని ఎన్నుకున్నారు.