కార్పొరేషన్, మార్చి 8 : కరీంనగర్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర బడ్జెట్లో ప్రకటించడంపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్‌లో పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితెల సతీశ్‌కుమార్, సుంకె రవిశంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులతో కలిసి సీఎం కటౌట్‌కు పాలాభిషేకం చేశారు.
అనంతరం విద్యార్థులు కేసీఆర్ కటౌట్‌ను ఎత్తుకొని ‘జై కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. మంత్రి, ఎమ్మెల్యేలతో కలిసి నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మా ట్లాడారు. నాడు ఉమ్మడిరాష్ట్రంలో ఉన్నత చదువులు చదివేందుకు అవకాశాలు లేక ఇతర రాష్ర్టాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉండేవని, స్థానికంగా అవకాశం లేక తాను కూడా ఇంజినీరింగ్‌ను మహారాష్ట్రలో చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కానీ స్వరాష్ట్రంలో విద్యార్థులకు స్థానికంగానే ఉన్నత విద్య అందించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు కూడా ప్రకటించడం హర్షనీయమన్నారు. ఇప్పుడు మెడిసిన్ చదవాలనుకునే వారందరికీ ఇక్కడే చదువుకునే అవకాశం వస్తుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటు అందిస్తున్నదని, అనేక కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పుతున్నాయని పేర్కొన్నారు. దీని వల్ల ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని తె లిపారు. ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితల సతీశ్‌బాబు మాట్లాడుతూ, పేద పిల్లలు కూడా ఉన్నత విద్య చదవాలన్న ఆలోచనతోనే సీఎం కేసీఆర్ నాణ్యమైన విద్యను అం దించే దిశగా కృషి చేస్తున్నారని చెప్పారు. మెడికల్ కళాశాల ఏర్పాటుతో ఇక్కడే ఉన్నత చదువులు చదువుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ వై సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్సీ నారదా సు లక్ష్మణ్‌రావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఏను గు రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, టీఆర్ఎస్ నాయకు లు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, జ యశ్రీ, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.