ఒకప్పటిలా ఇప్పుడు కొత్త సినిమాలు విడుదల కావడానికి నెలల సమయం అవసరం లేదు. ఈ రోజుల్లో ఆ వ్యవధి రోజుల్లోకి వచ్చేసింది. ఒక సినిమా విడుదలైన రెండు మూడు వారాలకే ఓటిటిలో విడుదల చేస్తున్నారు. పైగా ఇప్పుడు కరోనా వైరస్ కూడా ఉండడంతో సినిమాలు ఇంకా త్వరగా వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు పవర్ స్టార్ సినిమా వారం రోజుల్లో ఓటిటిలో విడుదలైంది. పవర్ స్టార్ అంటే కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్. ఈయనకు కర్ణాటకలో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈయన కర్ణాటక పవన్ కళ్యాణ్.
వారం రోజుల కింద ఈయన నటించిన యువరత్న సినిమా విడుదలైంది. దీనికి మంచి టాక్ వచ్చింది. కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కేవలం వారం రోజుల్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిపోయింది. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. థియేటర్ ఓనర్లు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. జనవరిలో మాస్టర్ సినిమా రెండు వారాలకు అమెజాన్ లో విడుదల అయితేనే నానా రచ్చ చేశారు ఎగ్జిబిటర్లు. ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే పునీత్ నటించిన యువరత్న ఓటిటి వేదికగా విడుదలైంది. దీనికి మరో కారణం కూడా ఉంది.
వైరస్ కారణంగా థియేటర్లలో కర్ణాటకలో 50 శాతం ఆక్యుపెన్సీ చేశారు. దాంతో కలెక్షన్లు సగానికి సగం పడిపోయాయి. ఇలాంటి సమయంలో నిర్మాతలు సేవ్ అవ్వాలంటే ఓటిటి త్వరగా విడుదల చేయాలి. అలా చేసిన వాళ్లకు మంచి రేటు వస్తుంది. దాంతో ఏప్రిల్ 1 న విడుదలైన యువరత్న ఏప్రిల్ 9న అమెజాన్ లో వచ్చేసింది. దీనికి అక్కడ అద్భుతమైన వ్యూస్ వస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా కూడా అంత పెద్ద హీరో సినిమా కేవలం వారం రోజుల్లోనే ఒరిజినల్ ప్రింట్ విడుదల చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయని ఎగ్జిబిటర్లు కంగారు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
ఇండియాలో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరంటే..?
పవన్ నో అంటే వకీల్ సాబ్ ఎవరు అయ్యేవారో తెలుసా?
అఖిల్‌ను గిల్లిన ఎన్టీఆర్.. వీడియో షేర్ చేసిన ఆర్జీవి