కనగల్, ఏప్రిల్ 24 : నల్లగొండ జిల్లా గుర్రంపోడ్ వద్ద మొన్న జరిగిన ప్రమాదంలో కనగల్‌కు చెందిన నర్సింగ్ మధు గౌడ్, నర్సింగ్ ధనుంజయ్ గౌడ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను శుక్రవారం నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు గౌడ్ కుటుంబానికి రూ. 2 లక్షలు, ధనుంజయ్ గౌడ్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.
నివాళులర్పించిన వారిలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీపీ కరీం పాషా, మాజీ సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి ధోటి శ్రీనివాస్, మండలాధ్యక్షుడు అయితగోని యాదయ్య, నగరాధ్యక్షుడు బోనగిరి దేవేందర్, నల్లగొండ నగర కార్పొరేటర్లు మారగోని భవాని గణేష్, పెరిక యాదయ్య, దొడ్డి రమేష్, బాణావత్ దీప్లా, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, కుందూరు ప్రవీణ్ రెడ్డి, స్థానిక మాజీ ఎంపీటీసీ పాలకూరి సైదులు, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు కడారి కృష్ణయ్య, మాజీ ఎంపీటీసీ సుంకిరెడ్డి వెంకట్ రెడ్డి, జానయ్య, చెనగోని నాగరాజు పాల్గొన్నారు.