Salman Khan | పూజా కార్యక్రమాలతో మొదలైన సల్మాన్ – వంశీ పైడి పల్లి మూవీ.. వీడియో వైరల్
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా విడుదలైన ప్రత్యేక వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. షూటింగ్ ప్రారంభంపై స్పందించిన సల్మాన్ ఖాన్, ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను వచ్చే ఏడాది ఈద్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కనున్న భారీ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా విడుదలైన ప్రత్యేక వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. షూటింగ్ ప్రారంభంపై స్పందించిన సల్మాన్ ఖాన్, ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను వచ్చే ఏడాది ఈద్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ నిరాశ చెందవద్దు. మీ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుంది అని అభిమానులకు హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఈద్ సందర్భంగా ఆయన సినిమాలు విడుదలై భారీ విజయాలు సాధించడం తెలిసిందే.
ఈ సినిమాలో సల్మాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో విజయవంతమైన సినిమాలతో గుర్తింపు పొందిన వంశీ పైడిపల్లి ఈ సినిమాతో హిందీ చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. సల్మాన్ ఖాన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, భావోద్వేగాల మేళవింపుతో కథ సిద్ధం చేసినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో, ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలతో సినిమా రూపొందనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో, టాలీవుడ్ హిట్ దర్శకుడు కలయికలో వస్తున్న ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈద్ విడుదల లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ సినిమా, సల్మాన్ ఖాన్ కెరీర్లో మరో విజయవంతమైన చిత్రంగా నిలుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, గత కొన్నాళ్లుగా సల్మాన్ ఖాన్ హిట్స్ అందించలేక నిరాశలో ఉన్నారు.టాలీవుడ్ డైరెక్టర్‌తో చేస్తున్న సినిమాతో అయిన మంచి హిట్ అందుకుంటాడా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

