MLA Krishna Mohan Reddy | శంకర్‌గౌడ్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి : ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి డిమాండ్
MLA Krishna Mohan Reddy | జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మద్దతు తెలిపారు.
గద్వాల : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ కార్మికులు( RTC ) నిర్వహిస్తున్న సమ్మెకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ( MLA Krishna Mohan Reddy ) మద్దతు తెలిపారు. వరంగల్ జిల్లా ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ శంకర్ గౌడ్ ( Shanker Goud ) మృతి పట్ల విచారం వ్యక్తం చేసి ఆయన చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
శంకర్‌గౌడ్ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్మికులు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కోరారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావతం కాకుండా ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని కార్మికులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.మరణించిన కార్మికుడు కుటుంబానికి తన తరఫున లక్ష రూపాయలను ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులు , నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

