ఎడపల్లి(శక్కర్‌నగర్)/మోర్తాడ్/వేల్పూర్/బాల్కొండ(ముప్కాల్)/ఆర్మూర్/ఇందల్వాయి/బోధన్‌రూరల్/మెండోరా, నవంబర్ 10 : విద్యార్థినులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఐసీడీఎస్ ఇన్చార్జి సీడీపీవో వినోద అన్నారు. ఎడపల్లి శివారులోని తెలంగాణ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు పలు పోటీలు నిర్వహించారు. అనంతరం వారితో మాట్లాడుతూ.. నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, బాల్య వివాహాలు, పొక్సో చట్టం గురించి తెలుసుకోవాలన్నారు. పోటీ ల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుహాసిని, అధ్యాపకులు, విద్యార్థినులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం దొన్కల్ గ్రామంలో బాలల హక్కుల వారోత్సవాలను పురసష్కరించుకొని విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, ఎంపీటీసీ అశోక్, ముత్తెన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలం జాన్కంపేట్‌లోని కస్తూర్బా పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. సీడీపీవో సుధారాణి, చైతన్య, సూపర్వైజర్ నీరజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. బాల్కొండలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం, ర్యాలీని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఎంపీడీవో సంతోష్‌కుమార్, ఎస్సై రాఘవేందర్, హెచ్ఎం, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో బాలల హక్కుల దినోత్సవంలో భాగంగా గ్రామ పంచాయతీల కార్యాలయాల ఆవరణల్లో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు ప్రజల సమక్షంలో గ్రామసభలను నిర్వహించారు. మైనర్ వివాహాలను అరికట్టడం తదితర అంశాలపై గ్రామసభల్లో సర్పంచుల ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు చర్చించారు. పిల్లలకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. సర్పంచులు మోహన్‌రెడ్డి, జమున, లక్ష్మి, సాయన్న, పూజిత, దీవెన, సవిత, సరోజన, నర్సయ్య పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలోని వెంగల్పాడ్లో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమంలో సీడీపీవో సునీత, స్వర్ణలత, అనిల్‌కుమార్, సుమిత్ర, రమేశ్‌నాయక్, రాజ్‌కాంత్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలంలోని సాలూరాలో బాలల హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామసభను నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ఐసీడీఎస్ పీడీ ఝాన్సీ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా అరిక ట్టాలని, బాల కార్మికులు ఉండకుండా చూడాలని తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి అంగన్వాడీ సెంటర్ లో మెనూ ప్రకారం వంట చేసి గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు భోజనం పెట్టాలని సూచించారు. సర్పంచ్ చంద్రకళ, ఐసీడీఎస్ సూపర్ వైజర్ సౌభాగ్య, గ్రామస్తులు ఉన్నారు. మెండోరా మండలం పోచంపాడ్‌లో అంగన్వాడీ టీచర్లు విద్యార్థినులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ మిస్బావొద్దీన్, ఎంపీటీసీ జాన్‌బాబు, ఉపసర్పంచ్ సతీశ్, సెక్రటరీ భోజేందర్, అంగన్వాడీ టీచర్లు భూలక్ష్మి, కమల, సుగుణ, విద్యార్థినులున్నారు.