స్టార్ యాక్టర్ కమల్ హాసన్ (kamal haasan) ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) డైరెక్షన్లో విక్రమ్ (vikram) సినిమా చేస్తున్నాడు. జూన్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కమల్ తన ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఇండియన్ 2 (Indian 2) గురించి ఓ అప్ డేట్ ఇచ్చి..అభిమానులు, శంకర్ ఫాలోవర్స్ లో జోష్ నింపాడు.
ఇండియన్ 2 త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. మేకర్స్ తో చర్చలు జరుగుతున్నాయి. సినిమా సాధ్యమైనంత త్వరగా సెట్స్‌పైకి వెళ్లబోతుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ అప్డేట్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు శంకర్, కమల్ ఫ్యాన్స్. కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శంకర్-కమల్ కాంబోలో వచ్చిన భారతీయుడు బాక్సాపీస్ ను షేక్ చేయడమే కాదు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సీక్వెల్‌గా వస్తున్న ఇండియన్ 2పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న విక్రమ్ చిత్రంలో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, సూర్య కీ రోల్స్ చేస్తున్నారు.