లోకనాయకుడు కమల్ హాసన్ (kamal haasan) నటిస్తోన్న తాజా చిత్రం విక్రమ్ (vikram). ఖైదీ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాను ప్రేక్షకులకు అందించిన లోకేశ్ కనగరాజ్ (lokesh kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కీ రోల్ చేస్తుండగా..కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాగా యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రం తెలుగు హక్కులను నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేశారు మేకర్స్. తాజా టాక్ ప్రకారం మే 31న హైదరాబాద్‌లో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న ఈవెంట్‌కు కమల్ హాసన్, డైరెక్టర్ అండ్ టీం మెంబర్స్ వస్తుండగా..తెలుగు సినీ పరిశ్రమ నుంచి చీఫ్ గెస్టుగా ఎవరొస్తారనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. విక్రమ్ జూన్ 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంతోపాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది విక్రమ్.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!