తన యాక్టింగ్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi). ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం కమల్‌హాసన్‌తో విక్రమ్ (Vikram) సినిమా చేస్తున్నాడు. విజయ్ సేతుపతి అప్ కమింగ్ హిందీ సినిమా గురించి అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. బాలీవుడ్ భామ కత్రినాకైఫ్ (Katrina Kaif) హీరోయిన్గా నటిస్తున్న మేరీ క్రిస్మస్ (Merry Christmas).
మూవీ షూటింగ్ రేపటి నుంచి ముంబైలో షురూ కానుందని బీటౌన్ సర్కిల్ సమాచారం. అంధాధున్ ఫేం శ్రీరామ్ రాఘవన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సంజయ్ కపూర్, రాధికా శరత్ కుమార్, వినయ్ పాఠక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యాచ్ బాంక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, టిప్స్ ఇండస్ట్రీతో కలిసి రమేశ్ తౌరని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్ ఒకటి సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!
Read Also : Thank You Teaser | లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు..‘థ్యాంక్యూ’ టీజర్