Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రానికి క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్స్ చేస్తున్నారు.
టాలీవుడ్ (Tollywood)లో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu). పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ (Krish) దర్శకత్వం వహిస్తున్నాడు. హరిహర వీరమల్లు ప్రాజెక్టులో బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీ రోల్స్ చేస్తున్నారు. పవన్‌తో సూపర్ హిట్ బ్లాక్ బ్లాస్టర్ ఖుషీ చిత్రాన్ని తెరకెక్కించిన టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం సమర్పిస్తుండగా..ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
కాగా పవన్ కెరీర్లోనే ఎక్కువ టైం తీసుకుంటున్న సినిమాగా ఈ చిత్రాన్ని అభివర్ణిస్తున్నారు సినీ విశ్లేషకులు. వకీల్‌సాబ్, భీమ్లానాయక్ చిత్రాలకు ముందే షూటింగ్ మొదలైన ఈ చిత్రం..ఈ సినిమాలు విడుదలైన తర్వాత కానీ షురూ కాలేదు. అయితే రీసెంట్గా ఫిక్స్ చేసిన మే 12 షూటింగ్ హరిహర వీరమల్లు షెడ్యూల్ రద్దయిందట. రెండు భారీ బడ్జెట్ సెట్స్ వేయడంతో స్టూడియో అద్దె భారం మీద పడే పరిస్థితులు నెలకొన్నాయని టాక్ వినిపిస్తోంది.
కాగా మరో కొత్త గాసిప్ ఇపుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. హరిహరవీరమల్లు విషయంలో నెలకొంటున్న పరిస్తితులతో పవన్ కల్యాణ్ అప్ సెట్ అవుతున్నాడట. నాణ్యమైన సెట్స్, కాస్ట్యూమ్స్ కు సంబంధించి పవన్ డైరెక్టర్ క్రిష్ ముందు అసంతృప్తిని వ్యక్తం చేశాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ సారి సినిమా కోసం కొత్తగా ఏదో చేయబోతున్నట్టు ప్రామిస్ చేసిన క్రిష్..మరేదో చేస్తున్నాడన్న కోపంతో పవన్ ఉన్నాడన్న న్యూస్ ఇపుడు ఫిలింనగర్లో హల్ చల్ చేస్తోంది.
ఇవన్నీ చూస్తుంటే హరిహరవీరమల్లు ఈ ఏడాది అనుకున్న సమయానికి రాదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హరిహరవీరమల్లు నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. 17వ శతాబ్దంలో మొగలుల కాలం నాటి వీరమల్లు జీవిత కథతో ఈ చిత్రం రాబోతున్నట్టు ఇప్పటివరకున్న టాక్.
Read Also : Hari Hara Veera Mallu | ‘హరిహరవీరమల్లు’తో పవన్ అప్సెట్..కారణమేంటో..?
Read Also : kamal haasan | కమల్ హాసన్‌ను కలిసిన నితిన్ తండ్రి..ప్రమోషన్ ప్లాన్‌పై చర్చ..!
Read Also : Thank You Teaser | లైఫ్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు..‘థ్యాంక్యూ’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

