న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ చోరీ జరిగింది. ఎర్ర కోట ప్రాంగణంలో ఓ మతపరమైన కార్యక్రమంలో రూ.1.5 కోట్ల విలువైన బంగారు కలశాలు చోరీకి గురయ్యాయి. జైన పూజారి వేషంలో వచ్చిన దొంగ బంగారు వస్తువులతో ఉడాయించినట్లు సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టింది. అనుమానితుడిని గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు.
ఆగస్టు15న పార్కు వద్ద దస్లక్షన్ మహోత్సవ పేరిట జైన మతస్థులకు చెందిన 10 రోజుల ఉత్సవాలు జరుగుతున్నాయి. గత బుధవారం పూజా క్రతువు కోసం ఏర్పాట్లు జరుగుతుండగా ఈ చోరీ జరిగింది. ఓ బంగారు కలశం, 760 గ్రాముల బరువున్న బంగారు కొబ్బరికాయ, మరో 115 గ్రాముల బరువుతో వజ్రాలు, ఎమెరాల్డ్స్, రూబీలు పొదిగిన చిన్న బంగారు కలశంతో సహా విలువైన పూజా పాత్రలు మాయమయ్యాయి.