బీపీని ముందే గుర్తించి నిరోధించు
రక్త పోటు (బీపీ) మార్గదర్శకాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) సవరించింది. వీటిలో మార్పులు చేయడం 2017 తర్వాత ఇదే మొదటిసారి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ఇతర గ్రూపులతో కలిసి ఈ హై బీపీ మార్గదర్శకాలను రూపొందించింది.
- బీపీ మార్గదర్శకాల్లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నినాదం
- యువతకు గుండె సంబంధిత ముప్పు నేపథ్యంలో జారీ
వాషింగ్టన్ : రక్త పోటు (బీపీ) మార్గదర్శకాలను అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) సవరించింది. వీటిలో మార్పులు చేయడం 2017 తర్వాత ఇదే మొదటిసారి. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ, ఇతర గ్రూపులతో కలిసి ఈ హై బీపీ మార్గదర్శకాలను రూపొందించింది. 20-30 ఏండ్ల మధ్య ఉన్న యువతకు గుండె సంబంధిత ముప్పు గతంలో కన్నా పెరిగిన నేపథ్యంలో ఈ మార్పులు చాలా ముఖ్యమైనవి. హై బీపీని ముందుగా గుర్తించడం, చికిత్స చేయడంపై ఈ కొత్త మార్గదర్శకాలు దృష్టి పెట్టాయి.
కేటగిరీల్లో మార్పు లేదు
ఈ కొత్త మార్గదర్శకాల్లో బీపీ కేటగిరీలు మారలేదు. నార్మల్ (<120/80), ఎలివేటెడ్ (120129/<80), స్టేజ్ 1 (130139/8089), స్టేజ్ 2 (140/90) mm Hg గా కొనసాగుతున్నాయి. మార్పు ఏమిటంటే, జీవనశైలిలో మార్పులు, అవసరమైతే మందుల వాడకం వంటివాటిని ముందుగానే అమలు చేయడమే. ఈ మార్గదర్శకాల ప్రకారం, రోజుకు వాడే సోడియంను 2,300 ఎంజీ నుంచి 1,500 ఎంజీకి తగ్గించుకోవాలి. ఆల్కహాల్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలి.
మందుల వాడకం తప్పనిసరి
ఆరోగ్య సమస్యలు పెరిగితే కేవలం జీవన శైలి మార్పుల వల్ల సత్ఫలితాలు రావు. మందులను వాడటం తప్పనిసరి. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, 3-6 నెలలపాటు ఆరోగ్యకరమైన మార్పులు చేసిన తర్వాత కూడా స్టేజ్ 1 హైపర్‌టెన్షన్ కొనసాగితే, వైద్యులు వెంటనే మందులను సూచించవచ్చు. స్టేజ్ 2 హైపర్ టెన్షన్ గలవారికి సింగిల్ పిల్లోనే రెండు మెడికేషన్స్‌ను ప్రారంభించాలి. దీనివల్ల నియంత్రణ పెరుగుతాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

