– గాలి సిద్ధిరాములు, ముదిరెడ్డిపల్లి
గ్రామాలు, నగరాలల్లో నిర్మించే ఇండ్లకు మధ్య ప్రాంతగతమైన తేడా ఉంటుంది. గ్రామాల్లో ఇండ్ల మధ్యలో కాంపౌండ్లు ఉండకుండా పక్కపక్కన లేదా వెనుక, ముందు ఒకరి ఇల్లు మరొకరి ఇంటిని అంటిపెట్టుకొని ఉంటాయి. నిర్మాణం చేసేటప్పుడే ప్రతి ఇంటికి మధ్యలో సందు లాంటి వీధులు ఉంటాయి. ఇంటి నిర్మాణంలో రెండు పొడవైన గదులు, చిన్నవంటగదితోపాటు వెనుక భాగంలో తూర్పు లేదా ఉత్తర భాగంలో ఖాళీ స్థలాన్ని కేటాయిస్తారు. తూర్పుదిక్కు ముఖం ఉండేలా ఇంటి నిర్మాణం చేస్తారు. పడమర స్థలంలోని పెద్దస్థలంలో పశువుల పాక, గడ్డి వాము, కోళ్ల గది నిర్మిస్తారు. ఆ ఖాళీ స్థలంలోనే మరుగుదొడ్డిని కట్టుకుంటారు. నగరంలో ఇది సాధ్యపడదు. స్థలం చిన్నదిగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. వాస్తు పాటించడంలో అందరూ వ్యక్తిగతమైన దోషాలు చేస్తారు. గ్రామాలు, నగరాల్లో ఒకే రకమైన వాస్తు ఉంటుంది. మంచి వాస్తు పాటించి ఎక్కడైనా నిర్మాణాలు చేపట్టవచ్చు.
– పానుగంటి రాజు, రాయిగిరి
కింది అంతస్తులోని కిచెన్ ఆగ్నేయంలోనే ఉంటుంది కదా! అని పైన ఆగ్నేయంలో పడకగది నిర్మించొద్దనే అనుమానం ఉండటం సహజం. కానీ దానివల్ల ఎలాంటి దోషం లేదన్న విషయం గ్రహించాలి. కింద ఇంట్లో ఉండే వాతావరణం పైన ఉండే పడకగదిని విచ్ఛిన్నం చేసేంత ప్రభావం చూపించదు. భారీ హోమాలు నిర్వహించినప్పుడు, హోటల్ కిచెన్, క్యాటరింగ్ వంటలు తయారు చేసినప్పుడు మాత్రమే.. వాటి ప్రభావం పైన ఉన్న పడకగదిపై చూపిస్తుంది. పైమేడలో దక్షిణ ఆగ్నేయంలో పడక గది చక్కగా అమరుతుంది. దానికి తూర్పు ఆగ్నేయంలో మరుగుదొడ్డి కట్టుకొని వాడుకోవచ్చు. ఆగ్నేయంలో నిర్మించిన బెడ్రూంలో మీ రెండో సంతానాన్ని ఉంచండి. మీకు అబ్బాయి, అమ్మాయి ఉన్నట్లయితే.. అమ్మాయికే ఆ గదిని ఇవ్వడం శ్రేయస్కరం. గెస్ట్రూముగా కూడా వాడుకోవచ్చు. పడకగది నిర్మాణ నిషేధం ఈశాన్యంలో కానీ.. ఆగ్నేయంలో కాదు.
– నందం ప్రియాంక, గద్వాల
మన అవసరాలకు తగ్గట్టుగానే మన ఇంటి విభజన చేసుకోవాలి. మీరు అడిగిన ప్రశ్నను బట్టి మీరు డూప్లెక్స్ ఇల్లు కడుతున్నట్లు అర్థమవుతుంది. గోడలమీద గోడలే రావాలి అనేది పాత పద్ధతి. పిల్లర్స్ లేకుండా కేవలం ఇటుకలతో, రెండు ఫీట్ల మందంతో మట్టి గోడలు కలిగిన మేడలు కట్టినప్పుడు.. కింద, పైనా ఒకేరకమైన గదులు ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం నిర్మాణ రంగంలో అనేక మార్పులు వచ్చాయి.
పైన పడమరలో ఒకే మాస్టర్ బెడ్రూమ్ కట్టుకొని కింద అదే స్థలంలో రెండు పడక గదులు వేసుకోవచ్చు. వాటికి తగిన విధంగా మరుగుదొడ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. శాస్త్ర ప్రకారం గదికి ఆగ్నేయం లేదా వాయవ్యం దిక్కుల్లో మరుగుదొడ్లు నిర్మాణం చేసుకోవాలి. కానీ ప్రస్తుతం ఇంటి స్థలాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ దిశలోనైనా నిర్మాణం చేసుకోవచ్చు. ఒకే స్థలంలో వాటిని నిర్మించాలనే నియమేమీ లేదు.
తూర్పు-ఉత్తరం రోడ్డు ఉంది.
– గంధం శ్రీలత, కొత్తకోట
తూర్పు-ఉత్తరం రోడ్లు వేయడం వల్ల ఆ స్థలం చాలా ప్రధానమైనదిగా అవుతుంది. కాబట్టి దానికి సెల్లార్ ఎట్టిపరిస్థితుల్లో పనికిరాదు. ఇంకేదైనా స్థలంలో ఎన్ని అంతస్తులైనా కట్టవచ్చు. మీరు చెప్పిన స్థలం ఈశాన్యం బ్లాక్ అవుతుంది. పైగా ఉత్తరం రోడ్డు ఉన్నా, తూర్పు రోడ్డు ఉన్నా ఆ స్థలంలో సెల్లార్ ఉండటం వల్ల దాని బలం పోతుంది. అక్కడ కమర్షియల్ బిల్డింగ్ కట్టాలనుకుంటే తప్పనిసరిగా పార్కింగ్ ఏర్పాటు చేయాలి. కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్‌ను వదిలి నిర్మాణం చేసుకోవాలి.
లేదంటే రెండు రోడ్లు ఉన్న స్థలానికి మరొక రోడ్డు పడమరకు లేదా దక్షిణంలో ఏర్పాటు చేసుకొని.. ఆ మార్గంగుండా సెల్లార్లోకి వెళ్లేలా భవనం కట్టుకోవచ్చు. అందుకు వీలు కాకుంటే స్టిల్ట్లోనే సెమీసెల్లార్ తీసుకోవాలి. ఈశాన్యం బ్లాక్‌లో సెల్లార్ తీసినప్పుడు ఆ భవనం గృహనిర్మాణానికి పనికిరాదు. అందుకు మరో నిర్మాణం అవసరం అవుతుంది.
-సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 98492 78143