Bonalu | మెదక్ రూరల్, నవంబర్ 27: మెదక్ మండల పరిధిలోని ఖాజీపల్లి గ్రామంలో శ్రీకాల భైరవ స్వామి 15వ ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. సాయంకాలం బోనాలను సమర్పించారు.
మహిళలు ఇంట్లో బోనం వండి.. అనంతరం ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. స్వామివారికి బోనాలను సమర్పించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని భక్తులు వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడింది.