Justice NV Ramana | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మధ్యవర్తిత్వ విధానాన్ని ప్రజలకు చేరువ చేయాలని, న్యాయ పరంగా ఇదొక పాశుపతాస్త్రం లాంటిదనే అంశంపై విసృ్తత స్థాయిలో జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లాలని సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. మీడియేషన్ఆర్బిట్రేషన్లను ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లాలని సూచించారు. మీడియేషన్, ఆర్బిట్రేషన్లను కక్షిదారులే కాకుండా న్యాయవాదులు, వ్యాపార, వాణిజ్య, ఐటీ సంస్థలు, భార్యాభర్తల వివాదాలు కూడా పరిషరించుకునేందుకు వీలున్నదని చెప్పా రు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అత్యాధునిక వసతులతో సింగపూర్, దుబాయ్, పారిస్, ఇంగ్లాండ్ తదితర అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాలకు దీటుగా ఏర్పాటైన ఐఏఎంసీలో కామన్వెల్త్ మెడ్ఆర్బ్ కాన్ఫరెన్స్2024 సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అంతర్జాతీయ మీడియేషన్ఆర్బిట్రేషన్ సెంటర్లకు మంచి ఆదరణ ఉన్నట్టుగానే ఐఏఎంసీని కూడా వినియోగంలోకి తేవాలని అభిలషించారు. అంతర్జాతీయ సంస్థలు, అదే స్థాయిలోని పరిశ్రమలు, వాణ్యిజ్య సంస్థలే తమ కేసులను సత్వరమే పరిషరించుకునే అవకాశం ఉందనేది అపోహ మాత్రమేనని అన్నారు. భార్యాభర్తల తగవుల నుంచి చిన్నపాటి వ్యాపారుల మధ్య నెలకొనే వివాదాలు కూడా పరిషరించుకునే వీలున్నదని వివరించారు. పైసా ఖర్చు లేకుండా ఇరుపక్షాలు తమ వివాదాన్ని పరిషరించుకోవచ్చునని చెప్పారు. మన దేశంలో ఆర్బిట్రేషన్మీడియేషన్ సెంటర్ అంటే ఢిల్లీ లేదా ముంబై అనే అపోహ నుంచి బయట పడాలని పేర్కొన్నారు. హైదరాబాద్ ఐఏఎంసీ విషయంలో నీరుగార్చే ప్రయత్నాలు చేస్తే ఆదిలోనే అడ్డుకోవాలని చెప్పారు.
తకువ వ్యయంతో శిక్షణ
తకువ వ్యయంతో శిక్షణ ఇచ్చే సౌకర్యం హైదరాబాద్ ఐఏఎంసీలో ఉన్నదని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొందరు వ్యక్తులు ఈ తరహా శిక్షలు ఇచ్చి ఐదారు లక్షల రూపాయలు వసూలు చేస్తారని పేర్కొన్నారు. అంతర్జాతీయ అక్రిడేటెడ్ గుర్తుంపు కూడా ఉన్న ఐఏఎంసీలో శిక్షణ పొందితే రూ.50 వేలు మాత్రమే ఖర్చు అవుతుందని వివరించారు. పీవీ నర్సింహారావు ప్రధాని అయ్యాక చేపట్టిన సరళీకృత ఆర్థిక విధానాలకు శ్రీకారం చుట్టినప్పుడు పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయ పరమైన కేసులు ఏండ్ల తరబడి మన దేశంలో పరిషారం కావనే విమర్శలు బాగా వచ్చాయని గుర్తుచేశారు. దీంతో నాటి కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి పీసీరావును ప్రధాని పీవీ ఆదేశించిన ఫలితంగానే 1996లో ఆర్బిట్రేషన్ యాక్ట్ వచ్చిందని వివరించారు. ఏపీలోని అనకాపల్లిలో బెల్లం వ్యాపారులకురైతులకు మధ్య ఏదైనా వివాదం తలెత్తితే.. వాటిని అకడి ఇరుపక్షాల పెద్దలే రాజీ ద్వారా పరిషరించుకుంటారని, ఒకటి కూడా కోర్టులో కేసు దాఖలు కాలేదని చెప్పారు. మధ్యవర్తిత్వ విధానం బలంగా నాటుకుపోయిందని, నిజానికి మధ్యవర్తిత్వ విధానం భారతీయ జీవనంలోనే ఉన్నదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక దేశంలోనే అత్యంత ప్రాధాన్యం ఉన్న హైదరాబాద్‌లో ఒక ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే తలంపు వచ్చిందే తడవుగా కార్యరూపంలో పెట్టేందుకు నాటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ యుద్ధప్రాతిపదికపై చర్యలు తీసుకున్నారని కొనియాడారు. భూమి ఇవ్వడమే కాకుండా తాతాలిక కార్యాలయ ఏర్పాట్లు చేశారని గుర్తుచేసుకున్నారు. ఐఏఎంసీని ప్రజలు, న్యాయవాదులు, ఐటీసంస్థలు, పరిశ్రమలు, చిన్నపాటి వ్యాపారులు సైతం సద్వినియోగం చేసుకుంటేనే అంతర్జాతీయ స్థాయిలోని ఆర్బిట్రేషన్ సెంటర్లకు దీటుగా నిలబడతామని చెప్పారు.