ఇబ్రహీంపట్నం : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ (BRS) లో చేరుతున్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సీపీఎం (CPM) పార్టీకి చెందిన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, యాచారం మండలం చింతుల్ల గ్రామానికి చెందిన ఎంపీ నర్సింహ, పార్టీ మాజీ కార్యదర్శి ఎంపీ జంగయ్య, పార్టీ సీనియర్ నాయకులు సామియల్, వార్డు సభ్యుడు ఎదుటి వెంకటేష్‌తో పాటు మరో యాభైమంది బీఆర్ఎస్ లో చేరారు.
ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి (MLA Manchireddy Kishan reddy ) కండువాను కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్లో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామని , పార్టీ గెలుపుకోసం ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్పార్టీ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిగా గెలుపొంది హాట్రిక్(Hatrick) సాధించటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో యాచారం మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేష్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి పాశ్చబాషతో పాటు పార్టీ మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.