అర్వపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని చూసి సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామం నుంచి పీఏసీఎస్ డైరెక్టర్ మారం వెంకట్ రెడ్డితోపాటు నాయకులు, కోమటిపల్లి గ్రామం నుంచి సీపీఐ పార్టీ నాయకులు చీరబోయిన లింగయ్యతో పాటు మరి కొంతమంది నాయకులు, కార్యకర్తలు, సూర్య నాయక్ తండా నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరయ్య, లింగయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలకు చోటు లేదన్నారు. తప్పుడు డిక్లరేషన్‌తో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరని, ఆ పార్టీకి ఓటేస్తే మళ్లీ కరెంట్ కష్టాలు తప్పవన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్న సీఎం కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదించాలన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.