ఎదులాపురం, జనవరి 30 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ పేరుతో నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకు వస్తుందా ? అని ప్రశ్నించారు.
రాజకీయంగా ఎదురొలేకనే ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో సిట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ సర్కారు నోటీసులిచ్చిందని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీఆర్ఎస్పై రేవంత్ సరార్ కుట్రలను చేస్తుందన్నారు. కాంగ్రెస్‌పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సిట్ వేసి హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం విచారణ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు.
ఫోన్ ట్యాపింగ్‌తో సీఎం, పార్టీలకు సంబంధం ఉండదన్న విషయం రేవంత్‌రెడ్డికి తెలిసి కూడా ఇలా చేయడం హేయమైన చర్యగా తాము భావిస్తున్నామన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా హోం శాఖ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నదన్నారు. కానీ కావాలనే ప్రతిపక్ష బీఆర్ఎస్పై అనుమానాలు వచ్చేలా ప్రజలను పకదోవ పట్టించేలా సిట్ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాసం నర్సింగ్, అజయ్, తేజ్‌రావు, సాజిదుద్దీన్, అజయ్, నారాయణ, పర్వీన్, కుమ్ర రాజు, ప్రశాంత్, కలీం, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.