హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ) : మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా రెండో విడత కౌన్సెలింగ్ రిపోర్టింగ్ గడువు పొడిగిస్తున్నట్టు కాళోజీ వర్సిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
శనివారం సాయంత్రం 4 నుంచి ఫిబ్రవరి 2న సాయంత్రం 4:30 వరకు రిపోర్టింగ్ చేయాలని అభ్యర్థులకు సూచించింది. అన్ని మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు రిపోర్ట్ చేసిన, చేయని అభ్యర్థుల వివరాలను అడ్మిషన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది.