వేతనాల పెంపుపై మెప్మా, సెర్ప్ సిబ్బంది, తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో ఫీల్ట్ అసిస్టెంట్లు బుధవారం జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహించారు. స్వీట్లు పంచుకొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. వేతనాలు పెంచి ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ నిజమైన ఉద్యోగ బంధుగా నిలిచారని కొనియాడారు.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై వరాల జల్లు కురిపించడంపై ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రతకు తోడు వేతనాలు పెంచడంపై సంబురాలు జరుపుకొన్నారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు జరిపించి స్వీట్లు పంచుకున్నారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడంపై ఫీల్డ్ అసిస్టెంట్లు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అందరి సంక్షేమం గురించి ఆలోచించే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం
అదృష్టమని సెర్ప్, మెప్మా సిబ్బంది పేర్కొన్నారు.