కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘జిగ్రీస్’. హరీశ్‌రెడ్డి ఉప్పుల దర్శకుడు. కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ నెల 14న సినిమా విడుదలకానున్నది. ప్రచారంలో భాగంగా ఈసినిమాలోని పాటను సక్సెస్ఫుల్ డైరెక్టర్ తరుణ్‌భాస్కర్ తాజాగా ఆవిష్కరించారు. ‘మీరేలే..’ అంటూ సాగే ఈపాటను దర్శకుడు హరీశ్‌రెడ్డి ఉప్పుల రాయగా, సయ్యద్ కమ్రాన్ స్వరపరిచారు.
ఏక్నాథ్ ఆలపించారు. స్నేహితుల భావోద్వేగాలను ప్రతిబింబిచేలా ఈ పాట సాగింది. ఫ్రెండ్షిప్, క్రేజీ అడ్వెంచర్స్‌తో కూడిన హిలేరియస్ రోడ్ ట్రిప్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి కెమెరా: ఈశ్వరాదిత్య.