Purushaha | కొత్తదనంతో కూడిన కథలతో తెలుగు ప్రేక్షకులకు అట్రాక్ట్ చేయడానికి ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయని తెలిసిందే. ఇప్పుడిదే లైన్లో వస్తోంది పురుష (Purushaha). వీరు వులవల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంతో బత్తుల కోటేశ్వరరావు కుమారుడు పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమవుతున్నాడు. ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది.
స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ డిఫరెంట్ క్యాప్షన్లతో పోస్టర్లు విడుదల చేస్తూ మూవీ లవర్స్ ఫోకస్ తమవైపునకు తిప్పుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు.
సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
కామెడీ జోనర్లో వస్తోన్న వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
గొప్ప గొప్ప యుద్ధాలన్నీ భార్యతోనే…
Wife vs Scissor-Man 🦸♂️✂️
The most epic showdown of the year is just 1 day away ⚡️@odela_srikanth unveiling the first look of #Purushaha
Get ready for non-stop fun and drama#WifeVsScissorMan@kalyanb949 @urvaishukrish@VeeruVulavala pic.twitter.com/SoCNwcnMgp
— RajkumarKasireddy (@Actor_Rajkumar9) November 4, 2025
NC 24 | నాగచైతన్య – మీనాక్షి చౌదరి జంటగా ‘NC24’ ..ఆసక్తి రేపుతున్న దక్ష లుక్