పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మహిళలకు భారీ హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ‘అమ్మ సోదరి గౌరవ పథకం’ కింద మకర సంక్రాంతి నుంచి రూ.30 వేల సాయం అందిస్తామని మంగళవారం ఓ ఎన్నికల సభలో ప్రకటించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కనీస మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ వరికి రూ.300, గోధుమలకు రూ.400 బోనస్ ఇస్తామని తెలిపారు.