పాట్నా: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలోని 10% మాత్రమే ఉన్న జనాభా మన సైన్యాన్ని నియంత్రిస్తున్నదని అగ్రకులాలను ఉద్దేశించి పేర్కొన్నారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘మన దేశంలోని జనాభాలో 90% దళితులు, మహాదళితులు, వెనుకబడిన వారు, బాగా వెనుకడిన వారు, మైనారిటీ కులాల వారు ఉన్నారు. దేశంలోని టాప్ 500 కంపెనీలను తీసుకుంటే అందులో మీకు దళితులు కానీ, బీసీలు కానీ కన్పించరు. అవన్నీ 10% జనాభా ఉన్న వారివే. అన్ని ఉద్యోగాలు వారికే వెళ్తాయి. వారికి సైనికులపై కూడా నియంత్రణ ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.