Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ “స్పిరిట్” చివరికి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్ల మేళవింపుగా రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్గా నటిస్తుండగా, ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు రెండేళ్ల క్రితమే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ, ప్రభాస్ గత కమిట్మెంట్స్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు ఎట్టకేలకు “స్పిరిట్” షూటింగ్ ఆరంభమైందని సమాచారం. ఎంతో సింపుల్‌గా పూజ కార్యక్రమం పూర్తిచేసి షూటింగ్ మొదలుపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ ప్రాజెక్ట్‌కి మరో ఇంటర్నేషనల్ టచ్ కూడా జోడైంది. కొంతకాలంగా ప్రచారంలో ఉన్నట్టుగానే ప్రముఖ కొరియన్ నటుడు డాన్ లీ (Don Lee) ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారికంగా ధృవీకరణ లభించింది. స్వయంగా డాన్ లీ తన సోషల్ మీడియా ద్వారా “కొత్త ప్రయాణం ఈ రోజు మొదలైంది. #Spirit” అంటూ పోస్ట్ చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. సందీప్ రెడ్డి వంగా ప్రతీసారి తన సినిమాల్లో కొత్త ఎమోషన్, కొత్త యాక్టర్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఇప్పుడు డాన్ లీ లాంటి ఇంటర్నేషనల్ స్టార్‌ను తీసుకోవడం “స్పిరిట్” సినిమాకు మరో స్థాయి హైప్ తీసుకొచ్చింది.
పాన్ ఇండియా మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ లెవల్లో విడుదల చేయాలన్న భారీ ప్లాన్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో “స్పిరిట్” గురించి పోస్టులు, ఫ్యాన్ క్రియేషన్లు ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ అంటేనే మాస్ అండ్ ఎమోషన్ ఫుల్ ప్యాకేజీ అని చెప్పే అభిమానులు, ఈ సినిమా తర్వాత బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయబోతున్నాయనే నమ్మకంతో ఉన్నారు.“స్పిరిట్” షూటింగ్ మొదలైన ఈ క్షణం నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు .ఇక సినిమా విడుదలయ్యే వరకు ఈ హైప్ ఆగేలా లేదు!