పర్వతగిరి, జూలై 11: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన అథ్లెటిక్ క్రీడాకారిణి, అర్జున అవార్డు గ్రహీత జీవంజి దీప్తి వరల్డ్ పారా చాంపియన్‌షిప్ గేమ్స్‌కు(World Para Championship Games) శుక్రవారం ఎంపికైంది. ఇటీవల బెంగళూరులోని కంటె రామ్ స్టేడియంలో జరిగిన వరల్డ్ పారా చాంపియన్‌షిప్ ఎంపిక పోటీల్లో ఆమె పాల్గొని 400 మీటర్ల విభాగంలో 56.06 నిమిషాల్లో పూర్తి చేసి ప్రథమ స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. దీప్తి వరల్డ్ పారా చాంపియన్‌షిప్ గేమ్స్‌కు ఎంపిక కావడంతో పలువురు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
Child | పెళ్లి కాకుండానే పిల్లకు తల్లి.. పుట్టగానే రూ.50 వేలకు బిడ్డ అమ్మకం.. ఐదుగురు అరెస్ట్..!
Radhika Yadav | తండ్రి చేతిలో హత్య.. రాధికపై నాలుగు రౌండ్ల కాల్పులు.. అటాప్సీ రిపోర్టులో వెల్లడి
Neeraj Chopra | నాకో సమస్య ఉంది.. బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నా..!