Chintal | ఓ వ్యక్తని హత్య చేసి ఆపై అర్ధరాత్రి మృతదేహాన్ని ఆటోలో తరలిస్తుండగా ప పోలీసులు పట్టుకున్నారు.ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. చింతల్లోని అంబేద్కర్ నగర్లో ఓ వ్యక్తి పదేండ్ల నుంచి మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఓ మహిళా తన కొడుకుతో కలిసి అతని గొంతు కోసి హత్య చేశారు. అనుమానం రాకుండా మృతదేహాన్ని కవర్లో చుట్టి అర్ధరాత్రి తరలిస్తుండగా సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు నిందితులను పట్టుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.