న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: జేఈఈ మెయిన్ 2025 పేపర్-2 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ దరఖాస్తు సంఖ్య, పాస్‌వర్డ్‌తో స్కోర్‌కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చునని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. బీఆర్క్, బీప్లానింగ్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్లో ఫలితాల్ని చెక్ చేసుకోవచ్చునని ఎన్టీఏ ప్రకటించింది. బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు జనవరి 30న ఎన్టీఏ జేఈఈ మెయిన్ పరీక్షలను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, విదేశాల్లోని 12 నగరాల్లో నిర్వహించిన పరీక్షలకు లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈనెల 22న ఎన్టీఏ తుది కీ విడుదల చేయగా, తాజాగా ఫలితాలను ప్రకటించింది. కాగా తొలి సెషన్లో సాధించిన పర్సంటైల్‌తో సంతృప్తి చెందని విద్యార్థులు మెరుగైన స్కోర్ కోసం సెషన్-2 పరీక్షలకు ఫిబ్రవరి 25లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.