Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
Jajula Srinivas Goud | హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీ కులగణనపై నెలకొన్న అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Jajula Srinivas Goud | హైదరాబాద్: దేశవ్యాప్తంగా బీసీ కులగణనపై నెలకొన్న అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. నవంబర్ 2న హైదరాబాద్ పర్యటనకు వస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీసీ సంఘాలతో సమావేశమై వారి సమస్యలను వినాలని కోరారు. జనగణనలో బీసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయడంతోపాటు ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లోని బీసీ భవన్లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జాజుల శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం నిర్వహిస్తున్న జనగణనలో ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయకపోవడం అన్యాయమని అన్నారు. ప్రతి బీసీ కులానికి ప్రత్యేక యూనిక్ కోడ్ కేటాయించకపోతే కులగణన ఉద్దేశం నెరవేరదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో బీసీలు సుమారు 60 శాతం జనాభా ఉన్నప్పటికీ, వారికి 27 శాతం రిజర్వేషన్లే అమలవుతున్నాయని జాజుల పేర్కొన్నారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచే అంశంలో శాస్త్రీయమైన జనాభా గణాంకాలు కీలకమని, సరైన కులగణన లేకపోవడం వల్ల రిజర్వేషన్ల పెంపునకు న్యాయపరమైన అడ్డంకులు ఎదురవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో 2024లో బీసీ కులగణన చేపట్టి, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపిందని జాజుల గుర్తుచేశారు. ఏడాది గడిచినా కేంద్రం నుంచి ఆమోదం లభించలేదని విమర్శించారు. బీసీ కులగణనతోపాటు రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించి, జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీల డిమాండ్ల సాధన కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగానే డిసెంబర్ 14, 15 తేదీల్లో ఢిల్లీలో ఆందోళనలు చేపట్టినట్లు గుర్తుచేశారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా అమిత్ షా బీసీ సంఘాలకు సమయం కేటాయించి వారి అభ్యంతరాలను స్వీకరించాలని కోరారు. ఇందుకు అవకాశం కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jajula Srinivas Goud | బీసీ కులగణనపై అమిత్ షా స్పందించాలి.. దేశవ్యాప్త ఉద్యమం ఆపేది లేదు: జాజుల
Books Launch | తెలుగు సాహితీ వికాస వేదిక ఆధ్వర్యంలో ఘనంగా పుస్తకాల ఆవిష్కరణ
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

