Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
Gold in Rapido | ర్యాపిడోలో బైక్ పార్సిల్ బుక్ చేసి బంగారు ఆభరణాలు పంపించాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌ను గమ్యస్థానానికి చేర్చాల్సిన డెలివరీ డ్రైవర్.. అందులోని రూ.62,383 విలువైన బంగారు ఆభరణాలతోనే ఉడాయించాడు.
Gold in Rapido | ర్యాపిడోలో బైక్ పార్సిల్ బుక్ చేసి బంగారు ఆభరణాలు పంపించాలనుకున్న ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. పార్సిల్‌ను గమ్యస్థానానికి చేర్చాల్సిన డెలివరీ డ్రైవర్.. అందులోని రూ.62,383 విలువైన బంగారు ఆభరణాలతోనే ఉడాయించాడు. దానికంటే ముందు పెట్రోల్ ఖర్చులకు డబ్బులు కావాలని అదనంగా రూ.100 వసూలు చేసి మరీ వెళ్లాడు. కానీ ఎంత సమయమైనా పార్సిల్ అందకపోవడంతో కంగారుపడి ఫోన్ చేయగా.. బాధితుడి నంబర్‌ను బ్లాక్ చేశాడు. ఈ వింత ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వెలుగుచూసింది.
దత్త ప్రసాద్ నల్లపాటి అనే వ్యక్తి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని వివో కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నాగోల్‌లోని తన బంధువుల ఇంటికి బంగారు ఆభరణాలు పంపించాలని అనుకున్నాడు. రూ.62,383 విలువైన బంగారపు ఉంగరాలు, గాజులను ఒక పార్సిల్లో ప్యాక్ చేశాడు. వాటిని పంపించేందుకు ర్యాపిడో పార్సిల్ సర్వీస్‌ను బుక్ చేశాడు. అనంతరం బంగారం ఉన్న పార్సిల్‌ను ర్యాపిడో డ్రైవర్‌కు ఇవ్వాలని సూచించాడు. ఇక కార్యాలయానికి వచ్చిన ర్యాపిడో డ్రైవర్ గీతిమెట్టు మురళికి సెక్యూరిటీ గార్డు పార్సిల్ అందజేశాడు.
ఈ సందర్భంగా పార్సిల్‌ను తీసుకున్న ర్యాపిడో డ్రైవర్.. పెట్రోల్ ఖర్చుల కోసం అదనంగా రూ.100 ఇవ్వాలని అడిగాడు. ఇదే విషయం సెక్యూరిటీ గార్డు చెప్పడంతో ర్యాపిడో డ్రైవర్‌కు దత్త ప్రసాద్ రూ.100 ఫోన్ పే చేశాడు. దీంతో ర్యాపిడో డ్రైవర్ పార్సిల్ తీసుకుని అక్కడి నుంచి బయల్దేరాడు. కాసేపటికి డ్రైవర్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చి నాగోల్‌లోని బంధువులకు కాల్ చేయగా.. తమకు ఇంకా పార్సిల్ అందలేదని చెప్పారు. కంగారుగా మళ్లీ ర్యాపిడో డ్రైవర్‌కు కాల్ చేయగా.. దత్త ప్రసాద్ ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేశాడు. మోసపోయానని గ్రహించిన దత్త ప్రసాద్ వెంటనే.. ర్యాపిడో కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. కానీ సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో దత్తప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దత్త ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gold in Rapido | ర్యాపిడోలో బంగారం పంపిస్తే.. ఆభరణాలతో ఉడాయించిన డ్రైవర్!
‘విద్యార్థులను శాస్త్రవేత్తలుగా తయారు చేయడంలో సైన్స్ కాంగ్రెస్ దోహదం’
కోదాడలో 120 కేజీల గంజాయి పట్టివేత
Beauty Tips | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

