YS Jagan | హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రాణహాని ఉందని స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ అంగీకరించింది. అందుకే జెడ్ ప్లస్ భద్రతను కొనసాగించాలని సిఫారసు చేసినట్టు తెలిపింది.
2014 లో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకున్నాక ఆయనకు వై క్యాటగిరీ భద్రత ఉన్నదని హైకోర్టుకు వివరించింది. ఎమ్మెల్యేగా జగన్ 1+1 భద్రతకే అర్హులని ఎస్ఆర్సీ తేల్చింది. తన భద్రతను తగ్గించేశారని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందున్న తన భద్రతను కొనసాగించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనికి కౌంటర్ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు రాష్ట్రస్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీని గతంలో ఆదేశించింది. ఈ మేరకు ఎస్ఆర్సీ తరపున ఐఎస్‌డబ్ల్యూ డీఐజీ, ఎస్పీఎస్ నచికేత్ విశ్వనాథ్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 13కు వాయిదా వేసింది.