అర్వపల్లి, ఫిబ్రవరి 10 : బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా సీనియర్ నాయకుడు, కుంచమర్తి గ్రామ మాజీ సర్పంచ్ మన్నె లక్ష్మీనర్సయ్య యాదవ్ సోమవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్, నాగారం సర్పంచ్ గుంటకండ్ల రామచంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యుల పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్, మాజీ జడ్పీటీసీలు దావుల వీరప్రసాద్ యాదవ్, జీడి భిక్షo, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, ప్రభు, రాoకోటి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.