Sachin Tendulkar : అండర్ -19 వరల్డ్‌కప్ హీరోలపై ప్రశంసల జట్లు కురుస్తోంది. జగజ్జేతలుగా స్వదేశం తిరిగొచ్చిన భారత బృందాన్ని దిగ్గజ ఆటగాళ్లు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తాజాగా కెప్టెన్ ఆయుశ్ మాత్రే(Ayush Mhatre)కు అపురూపమైన కానుక అందించాడు. భారత్‌ను అజేయంగా నడిపించి విశ్వ విజేతగా నిలిపింనందుకు అతడికి తన టెస్టు జెర్సీని బహూకరించాడు. లెజెండరీ ఆటగాడి నుంచి విలువైన బహుమతి అందుకున్న మాత్రే సంతోషం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టాడు.
ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో ముందుండే సచిన్ టెండూల్కర్ ఈసారి అండర్ -19 వరల్డ్‌కప్ కెప్టెన్ ఆయుశ్ మాత్రేను ఆకాశానికెత్తేశాడు. భారత జట్టుకు ఆరో కప్‌ను సాధించిన అతడిని ప్రశంసించిన సచిన్.. అతడికి మర్చిపోలేని బహూకరించాడు. మంగళవారం ముంబైలోని తన నివాసంలో మాత్రేను అభినందించిన క్రికెట్ దిగ్గజం.. డియర్ ఆయుశ్.. నీ కెరీర్ విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నా అని రాసున్న టెస్టు జెర్సీని కానుకగా ఇచ్చాడు. ఇలానే కష్టపడుతూ ఉండు. జనాల కామెంట్లను పట్టించుకోకు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ప్రాక్టీస్ మానేయకు. ఆట మీద శ్రద్ధతో ఉండాలి అని యువ క్రికెటర్‌కు సచిన్ విలువైన సూచలనలు చేశాడు.
చిన్నప్పటి నుంచి సచిన్ ఆటను చూస్తూ పెరిగిన ఆయుశ్.. అతడి నుంచి నుంచి విలువైన కానుక అందుకోవడంతో సంతోషంలో మునిగి తేలుతున్నాడు. తన సంతోషాన్ని పంచుకున్నాడు. ‘చిన్నప్పటి నుంచి మిమ్మల్ని టీవీ స్క్రీన్‌లో చూస్తూ పెరిగాను. ఈరోజు నేను మీ ఇంట్లో ఉన్నాను. మీ క్రికెట్ ప్రయాణంలో భాగమైన అపురూపమైన కానుక ఇప్పుడు నా చేతుల్లో ఉంది. నాకు ఈ గౌరవం కల్పించినందుకు ధన్యవాదాలు సార్. భారత క్రికెట్‌కు ఏళ్లుగా మీరు ఎలాగైతే సేవలందించారో.. నేను కూడా అదే గౌరవాన్ని కొనసాగిస్తాను’ అని మాత్రే తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.
అండర్-19 వన్డే వరల్డ్‌కప్‌లో భారత కుర్రాళ్లు టైటిల్ పట్టేశారు. తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన భారత జట్టుకు ఆరో టైటిల్ కట్టబెట్టారు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(175) విధ్వంసక శతకంతో విరుచుకుపడగా.. బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. అంబ్రిష్(3-56) విజృంభించగా100 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. 174కే ఏడు వికెట్లు పడినా.. టెయిలెండర్ ఫాల్క్‌నర్(115) వీరోచిత సెంచరీ బాదినా సరిపోలేదు. కనిష్క్ ఓవర్లో ఖిలాన్ పటేల్ డైవింగ్ క్యాచ్ అందుకోగా ఆరోసారి అండర్-19 ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా.
అండర్-19 వన్డే వరల్డ్‌కప్‌లో అజేయంగా ఫైనల్ చేరిన భారత జట్టు టైటిల్ పట్టేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(175) విధ్వంసక శతకంతో విరుచుకుపడగా.. బౌలర్లు ఇంగ్లండ్ బ్యాటర్లను బెంబేలెత్తించారు. అంబ్రిష్(3-56) విజృంభించగా100 పరుగుల తేడాతో ప్రత్యర్ధిని మట్టికరిపించింది. 174కే ఏడు వికెట్లు పడినా.. టెయిలెండర్ ఫాల్క్‌నర్(115) వీరోచిత సెంచరీ బాదినా సరిపోలేదు. కనిష్క్ ఓవర్లో ఖిలాన్ పటేల్ డైవింగ్ క్యాచ్ అందుకోగా ఆరోసారి అండర్-19 ఛాంపియన్‌గా నిలిచింది టీమిండియా.