Madapur SI | హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సై వినయ్ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు.
ఏసీబీ వివరాల ప్రకారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి చీటింగ్ కేసులో అరెస్టయ్యాడు. అతనిని జైలు నుంచి తప్పించేందుకు ఎస్సై వినయ్ రూ.50 వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యక్తి తరఫు వ్యక్తుల నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. దీంతో ఎస్సైని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచం సొమ్మును సీజ్ చేశారు.