Neha shetty | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఓజీ. పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఓజీలో డీజే టిల్లు భామ నేహాశెట్టిపై ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారని తెలిసిందే. కానీ ఓజీ ఫైనల్ కట్లో మాత్రం ఈ పాటను తీసేశారు. ఇంతకీ ఈ పాటను పెట్టకపోవడం వెనుకున్న కారణమేంటనే దానిపై నెట్టింట తెగ చర్చ నడుస్తోంది.
ఈ పాటను డిసెంబర్ 2024లో బ్యాంకాక్‌లో షూట్ చేశారు. ఈ సాంగ్ బీటీఎస్ మూమెంట్స్‌ను నేహాశెట్టి సోషల్ మీడియాలో షేర్ కూడా చేసుకుంది. అయితే ఈ పాటను ఎందుకు తీసేశారా.. అని అభిమానులు మాత్రం నెట్టింట తెగ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ క్లారిటీ ఇచ్చాడు. సినిమా ఫ్లో (కథనాన్ని) ఆపేసే అవకాశం ఉన్నందున ఈ పాటను తొలగించాం. అయితే ఆ తర్వాత ఈ పాటను కొత్త ఐడియాతో ఫ్రెష్ ఫీల్ అందించేలా తీసుకొచ్చేందుకు పని చేశాం. ఈ పాటను సోమవారం నుంచి థియేటర్లలో యాడ్ చేయబోతున్నామని తెలియజేశాడు. అంతేకాదు మేకర్స్ హైదరాబాద్‌లో బుధవారం సక్సెస్ మీట్‌ను కూడా ప్లాన్ చేస్తున్నారు. నేహాశెట్టి స్పెషల్ సాంగ్ యాడ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ఓజీ మరిన్ని వసూళ్లు రాబట్టడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఓజీలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శామ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. ఓజీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్పై డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. ఓజీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Kayadu Lohar | అనుదీప్‌తో సినిమా చేస్తున్నా.. కామెడీ చేయడం చాలా కష్టమైన పని : కయాదు లోహర్
Jatadhara | ధన పిశాచి వచ్చేస్తుంది.. సుధీర్ బాబు జటాధర నుంచి సోనాక్షి సిన్హా లుక్ వైరల్
Jacqueline Fernandez | డోన్ట్ కేర్ అంటూ ఫ్యాషన్ వీక్‌లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సందడి.. వీడియో