Jacqueline Fernandez | కిక్, రేస్, రైడ్, వెల్కమ్, హౌస్‌ఫుల్ సినిమాలతో సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (Jacqueline Fernandez). ఓ వైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ సుందరి మరోవైపు మనీలాండరింగ్ కేసుతో నిత్యం వార్తల్లో నిలుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మనీలాండరింగ్ కేసులో తనపై దాఖలైన ఎఫ్ఐఆర్, ఈడీ ఛార్జిషిట్ను రద్దు చేయాలని కోరుతూ జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు జాక్వెలిన్ క్రిమినల్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే వివాదాల సంగతి ఎలా ఉన్నా ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటోంది జాక్వెలిన్ ఫెర్నాండేజ్. తన ఫాలోవర్లు, అభిమానుల కోసం ఈ భామ లండన్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేసింది. లాంగ్ ప్రింటెడ్ బ్లేజర్లో మెరిసిన జాక్వెలిన్ ఫెర్నాండేజ్ అనామిక ఖన్నా AK|OK runway షోలో హొయలు పోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. లండన్ ఫ్యాషన్ వీక్ షోకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన జాక్వెలిన్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
కాగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తెలుగులో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతుందని కూడా ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ భామ టాలీవుడ్ డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు రెడీ అయిందని.. ఫీ మేల్ సెంట్రిక్ సినిమాగా ఈ ప్రాజెక్టు ఉండబోతుందని తెలుస్తుండగా.. దీనిపై రానున్న రోజుల్లో ఏదైనా స్పష్టత వస్తుందేమో చూడాలి మరి.
Jacqueline Fernandez at the AK|OK Anamika Khanna showcase during London Fashion Week 2025 ✨🥰#Jacqueline #JacquelineFernandez pic.twitter.com/VSb81Rs4HR
— WV – Media (@wvmediaa) September 23, 2025
Jacqueline Fernandez at the AK|OK Anamika Khanna showcase, London Fashion Week 2025 #Jacqueline #JacquelineFernandez @Asli_Jacqueline pic.twitter.com/nDNCQvucTg
— Cinema Mania (@ursniresh) September 23, 2025
A. R. Rahman | పొన్నియన్ సెల్వన్ పాటపై కాపీ రైట్ కేసు.. ఏఆర్ రెహమాన్‌కు ఊరట
Ananthika Sanilkumar | సందీప్ వంగా చిత్రంలో ‘8 వసంతాలు’ భామ.?
Rani Helps Shah Rukh | రాణి సాయం తీసుకున్న షారుఖ్.. వీడియో వైరల్